విశాఖపట్నం (పిఆర్ న్యూస్ టుడే) విశాఖపట్నం image widgetవిశాఖపట్నం నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు. మే-2026 నెలలో నగరవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 68 ఆస్తి నేరాల కేసులు నమోదు కాగా, వాటిపై నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు క్రైమ్ వింగ్ డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి, రికార్డు స్థాయిలో 48 కేసులను ఛేదించాయి.

గోపాలపట్నం జూన్ 26 : (pr newstoday) తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే ఓ పాత నేరస్థుడిని గోపాలపట్నం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సింహాచలంలోని ప్రియ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ మిస్టరీని పోలీసులు వేగంగా చేధించి, మల్కాపురం నివాసి అయిన నూనెల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..