By Nareshkarri111 , 25 June 2026

పరవాడ జూన్ 25 : (పిఆర్ న్యూస్ టుడే) పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలంలోని వాడ చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దళాయిపాలెం గ్రామంలో 25 లక్షల రూపాయల ఎన్టీపీసీ (NTPC) సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా నాయుడుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపాలెం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ బాలికల హాస్టల్ భవనాలను కూడా వారు ప్రారంభించడం జరిగింది.

By Nareshkarri111 , 25 June 2026

పెందుర్తి, జూన్ 25: యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవి సతీష్ కుమార్ సూచనల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని నాయుడు తోటలోని భాష్యం స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత విలువైన సమయమని, ఈ సమయంలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.

By Nareshkarri111 , 25 June 2026
ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్