విశాఖపట్నం (అల్లిపురం): ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా అంగవైకల్యాన్ని శాశ్వతంగా దూరం చేయవచ్చని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పిలుపునిచ్చారు. స్థానిక 32వ వార్డు పరిధిలోని అల్లిపురం, నేరేళ్ల కోనేరు వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ... 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.

గోపాలపట్నం జూన్ 26 : (pr newstoday) తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే ఓ పాత నేరస్థుడిని గోపాలపట్నం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సింహాచలంలోని ప్రియ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ మిస్టరీని పోలీసులు వేగంగా చేధించి, మల్కాపురం నివాసి అయిన నూనెల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..