విశాఖపట్నం సిటీ, జూన్ 25 (పీఆర్ న్యూస్ టుడే):
నగర పోలీసు శాఖలో సిబ్బంది సంక్షేమంతో పాటుగా వారు అందించిన సేవల యందు ప్రతిభను గుర్తిస్తూ, ఉన్నతాధికారుల సమక్షంలో 244 మందికి నగర పోలీసు కమీషనర్ గారు రివార్డులను అందజేశారు. ఈ రోజు నిర్వహించిన క్రైమ్ రివ్యూ మీటింగ్ నందు నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు గత నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవలను ప్రోత్సహిస్తూ 244 మందికి రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేయడం జరిగినది. నగర పోలీసు శాఖ నందు హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకూ వారు నిర్వహిస్తున్న విధులకు తగ్గా గుర్తింపు ఇస్తూ, ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేసి, వారు సమర్ధవంతముగా విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందికి ప్రేరణ ఇస్తూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం మరింత సురక్షితముగా ఉండే దిశగా సిపి గారు చర్యలు తీసుకున్న విషయం విధితమే. ఇందులో భాగంగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్న గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో, చోరీ కాబడిన సొత్తు మరియు ఇతర వస్తువులను రికవరీ చేసి నిందితులను అరెస్టు చేసిన పలు కేసులలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసులలో, సైబర్ క్రైమ్ కేసులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 244 మంది హోం గార్డు నుండి సీ.ఐ వరకూ గల సిబ్బందికి రివార్డులు మంజూరు చేశారు. సిబ్బంది అందరూ ప్రేరణ చెంది మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేలా ఈ రోజు క్రైమ్ మీటింగ్ నందు నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ రివార్డు మంజూరు ఆర్డరును ఇవ్వడం జరిగినది.

Comments