పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభం: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

By Nareshkarri111 , 25 June 2026
25 లక్షల రూపాయల ఎన్టీపీసీ (NTPC) సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ప్రారంభించారు

పరవాడ జూన్ 25 : (పిఆర్ న్యూస్ టుడే) పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలంలోని వాడ చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దళాయిపాలెం గ్రామంలో 25 లక్షల రూపాయల ఎన్టీపీసీ (NTPC) సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా నాయుడుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపాలెం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ బాలికల హాస్టల్ భవనాలను కూడా వారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... స్థానికులకు పరవాడ ఫార్మా కంపెనీలలో, అలాగే ఎన్టీపీసీ (NTPC) లో ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా చేపట్టామని ఆయన మీడియాకు వివరించారు.

Comments

WhatsApp Share Button