విశాఖపట్నం, జూన్ 27: (పి ఆర్ న్యూస్ టుడే) నగరంలో భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి, నిరాశ్రయులకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో విశాఖపట్నం నగర పోలీసులు ‘జ్యోతిర్గమయ’ పేరుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. నగర పోలీస్ కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు, కంట్రోల్ రూమ్ సీఐ మరియు వారి బృందం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న 14 మందిని అధికారులు గుర్తించారు. వారిని సురక్షితంగా రక్షించిన పోలీసులు, పునరావాసం కల్పించే నిమిత్తం షెల్టర్ హోమ్‌కు తరలించారు. నిరాశ్రయులను ఆదుకోవడంలోనూ, భిక్షాటన రహిత సమాజాన్ని నిర్మించడంలోనూ పోలీసులు చూపుతున్న చొరవను పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన కంట్రోల్ రూమ్ సీఐ మరియు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని పోలీస్ యంత్రాంగం నిర్ణయించింది.
Comments