64వ వార్డు గంగవరంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం: జనసేన వార్డ్ ప్రెసిడెంట్ సిహెచ్. ముసలయ్య చొరవ

By Nareshkarri111 , 27 June 2026
జనసేన 64వ వార్డ్ ప్రెసిడెంట్

గాజువాక (పి ఆర్ న్యూస్ టుడే)  గాజువాక నియోజకవర్గం 64వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామం, రామాలయం వీధిలో గత కొంతకాలంగా వేధిస్తున్న డ్రైనేజీ లీకేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.కూటమిలో భాగంగా డ్రైనేజీ లీకేజీ కారణంగా వస్తున్న తీవ్ర దుర్వాసనతో తాము పడుతున్న ఇబ్బందులను టిడిపి సీనియర్ నాయకులు **బందు మాధవరావు** గారు మరియు స్థానిక మహిళలు.. జనసేన 64వ వార్డ్ ప్రెసిడెంట్, విశాఖ జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి **సిహెచ్. ముసలయ్య** గారి దృష్టికి తీసుకెళ్లారు.మహిళల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సిహెచ్. ముసలయ్య గారు, జీవీఎంసీ (GVMC UGD) డిపార్ట్మెంట్ అధికారులతో మరియు వర్క్ ఇన్స్పెక్టర్ రమణ గారితో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీనితో అధికారులు వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన రామాలయం వీధిలో డ్రైనేజీ లీకేజ్ ప్రాబ్లంను క్లియర్ చేశారు.దీర్ఘకాలిక సమస్య తీరడం, దుర్వాసన నుండి విముక్తి లభించడంతో స్థానిక మహిళలు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, జనసేన వార్డ్ ప్రెసిడెంట్ సిహెచ్. ముసలయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమ విజయవంతానికి అర్జిల్లి బంట్రోతు బాలు (ఆర్గనైజింగ్), ఒలి శెట్టి బంగారు రాజు గారు ప్రత్యేకంగా కృషి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు అమ్మోరు, బుజ్జి, ధనరాజు, తాతారావు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

WhatsApp Share Button