ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసిన కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు

By Nareshkarri111 , 27 June 2026
దేవస్థానం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్‌గా సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం అభివృద్ధి, ధర్మ పరిరక్షణ, భక్తుల సేవకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా కందుల నాగరాజు పేర్కొన్నారు.“ఈ బాధ్యత నాకు ఒక పదవి మాత్రమే కాదు… అమ్మవారి సేవ చేసే మహద్భాగ్యం” అని డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు.

Comments

WhatsApp Share Button