గోపాలపట్నం (prnewstoday): సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త, బోర్డు చైర్మన్, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు శుక్రవారం విజయనగరంలోని ఆయన అతిథి గృహంలో ఘనంగా జరిగాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు దంపతులు అశోక్ గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాలను సమర్పించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటాన్ని అశోక్ గజపతిరాజు దంపతులకు జ్ఞాపికగా అందజేశారు. స్వామివారి అనుగ్రహంతో వారు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని వేద పండితులు ఆకాంక్షించారు.ఈ వేడుకలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మధుపాడ సన్యాసిరావు, కరక దేముడు, నీటిపల్లి మహేష్, పెద్దిశెట్టి ఉషశ్రీ, లలిత జ్యోతి, చలమూరి భారతి శ్రీనివాస్, బండ్ల ధరణిరామ్, వెంపడపు అన్నపూర్ణ రమణ, సుసరపు గణపతిరావు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా బోకం స్వామినాయుడు హాజరై అశోక్ గజపతిరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అశోక్ గజపతిరాజు నాయకత్వంలో సింహాచలం దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు ఆకాంక్షించారు.
- Log in to post comments
Comments