పరవాడ నూతన సీఐ భాస్కరరావును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత అర్జిల్లి అప్పలరాజు

By Nareshkarri111 , 27 June 2026
అర్జిల్లి అప్పలరాజు, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ జనసేన నాయకులు

పరవాడ, (పి ఆర్ న్యూస్ టుడే) :పరవాడ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ లంకా భాస్కరరావును జనసేన పార్టీ సీనియర్ నాయకులు అర్జిల్లి అప్పలరాజు, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ జనసేన నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ భాస్కరరావుకు వారు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి నూతన బాధ్యతలకు గాను శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్జిల్లి అప్పలరాజు మాట్లాడుతూ.. పరవాడ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రతాంబూలం ఇవ్వాలని, బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు. ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు అధికారులకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసైనికులు బొంది దుర్గారావు, చింతకాయల ముత్యాలు, సూరాడ మహేష్, సూరాడ అమ్మోరయ్య, బొంది ముల్లారి, బొంది అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

WhatsApp Share Button