మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా 'వెంకయ్య నాయకుడు' పుస్తక పరిచయ కార్యక్రమం

By Nareshkarri111 , 28 June 2026
విజయవాడలోని సుజన - ద వెన్యూ నందు అత్యంత ఘనంగా జరిగింది.

విజయవాడ : సీనియర్ పాత్రికేయులు శ్రీ మాశర్మ గారు రచించిన వెంకయ్య "నాయకుడు" పుస్తక పరిచయ కార్యక్రమం ఈరోజు విజయవాడలోని సుజన - ద వెన్యూ నందు అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ మరియు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో వివిధ శాఖలకు చెందిన గౌరవ మంత్రులు, పలు నియోజకవర్గాల శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Comments

WhatsApp Share Button