ఆర్ఆర్ వెంకటాపురంలో ముమ్మరంగా పోలియో చుక్కల కార్యక్రమం: స్వయంగా డ్రాప్స్ వేసిన జనసేన, టీడీపీ నాయకులు

By Nareshkarri111 , 28 June 2026
ఆర్ఆర్ వెంకటాపురం గోపాలపట్నం

గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురం: ఆర్ఆర్ వెంకటాపురంలో ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య రక్షణకై పోలియో చుక్కల కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్, జనసేన సీనియర్ నాయకుడు 92వ వార్డ్ గొన్నబత్తుల రాజు, తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్ మంగ లక్ష్మి స్వయంగా పాల్గొని చిన్నారులకు తమ చేతుల మీదుగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పక్షవాతం మహమ్మారి బారిన పడకుండా చిన్నారుల భవిష్యత్తుకు ఈ వ్యాక్సిన్ డ్రాప్స్ రక్షణ కవచంగా మారుతాయని, ప్రతి తల్లిదండ్రూ సామాజిక బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. సమాజంలో నూటికి నూరు శాతం పోలియో నిర్మూలనే లక్ష్యంగా వైద్య ఆరోగ్య సిబ్బంది చేస్తున్న ఈ బృహత్తర ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదాంబ, సునీత, ఆర్పీలు దేవి, పార్వతి పాల్గొని, పరిసర ప్రాంతాల తల్లులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

WhatsApp Share Button