కష్టకాలంలో కాపాడిన 'ముఖ్యమంత్రి సహాయ నిధి'.. నిమిషాల్లో చెక్కులందజేసి బాధితులకు అండగా నిలిచిన విప్ గణబాబు!

By D M SATISH KUMAR , 7 September 2026
8.30 లక్షల చెక్కులు స్వయంగా అందజేసిన గణబాబు!

గోపాలపట్నం

పశ్చిమ నియోజకవర్గం  ఖరీదైన వైద్య చికిత్సలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంపూర్ణ భరోసానిస్తోంది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 17 మంది బాధితులకు మంజూరైన రూ. 8,30,312/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) ఆదివారం గోపాలపట్నంలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. ఆపదలో ఉండి తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి అర్జీని పరిశీలించి, సకాలంలో వైద్య సాయం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేగంగా నిధులు మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సకాలంలో సాయం అందించి ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గణబాబు గారికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Comments

WhatsApp Share Button