మానవీయ విలువలు, శాంతి సందేశంతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రామేశ్వరి, విమల నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)ను కలసి రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబుకు వారు పవిత్ర రాఖీ ధరింపజేసి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. సమాజంలో ద్వేషాలు తొలగి సోదరభావం, శాంతి, పరస్పర సద్భావనలు పెంపొందాలని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సమయాన్ని వెచ్చించి వచ్చి తనకు రాఖీ కట్టి ఆశీస్సులు అందజేసిన బ్రహ్మకుమారీస్ ప్రతినిధులకు ఎమ్మెల్యే గణబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Comments