విశాఖపట్నం : జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. పశ్చిమ జోనల్ కమిషనర్ హేమవతి, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (ఏ ఎం హెచ్ ఓ) డాక్టర్ హర్ష సుదర్శన్ బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అందించే సేవల్లో ఎక్కడా అలసత్వం వహించకూడదని, రోడ్లు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. డోర్-టు-డోర్ చెత్త సేకరణ 100% శాతం జరగాలని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగదారులపై భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. ఈ ఆదర్శ నియోజకవర్గ సంకల్పంలో అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని అధికారులు కోరారు. నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య పరిశుభ్రతకు పాటుపడుతున్న జోనల్ కమిషనర్ హేమవతి, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్ష సుదర్శన్ లపై స్థానిక ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు.
Comments