విశాఖ ప్రజలకు ఎమ్మెల్యే గణబాబు ఆహ్వానం సెప్టెంబర్ 19న ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

By D M SATISH KUMAR , 16 September 2026
విశాఖపట్నం

విశాఖపట్నం  ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు నెరవేరుతోందని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) తెలిపారు. ప్రభుత్వ స్థలాలలో ఆక్రమించిన నిర్మాణాలకు సంబంధించి జి.ఓ. నంబర్లు 296, 388, 30, 45 మరియు 84 ల ప్రకారం క్రమబద్ధీకరణ చేసిన పట్టాలు మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 19, 2026న విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు  ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని ఎమ్మెల్యే గణబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని తమ ఇళ్లకు సంబంధించిన క్రమబద్ధీకరణ పట్టాలు మరియు రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకోవాలని కోరారు. అలాగే సభకు విచ్చేసే లబ్ధిదారుల సౌకర్యార్థం వారి ప్రాంతాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ మైదానానికి చేరుకోవడానికి ఉచిత రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Comments

WhatsApp Share Button