22A నిషేధిత భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనకు అవకాశం: అనుమతులున్న ప్లాట్లు, భవనాలకు ఊరట దక్కే ఛాన్స్!

By D M SATISH KUMAR , 16 September 2026
తెలంగాణ

తెలంగాణ  : రాష్ట్రంలో నిషేధిత భూముల (22A) జాబితా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై శాసనసభ వేదికగా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా గతంలో హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు పొంది కూడా సాంకేతిక కారణాలతో ‘22ఏ’ నిషేధిత జాబితాలోకి చేరిన లేఅవుట్లు, నివాస భవనాలకు సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సక్రమంగా అనుమతులు పొందిన ఆస్తులను ఈ నిషేధిత జాబితా నుంచి తొలగించి, సామాన్యులకు ఉపశమనం కలిగించేలా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టే ప్లాన్‌లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై సీఎం ఇప్పటికే సంబంధిత మంత్రులతో చర్చించగా, అసెంబ్లీ ప్రారంభానికి ముందు తన ఛాంబర్‌లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాతే సభలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం సభలో ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారనేదానిపై ప్రస్తుతం తీవ్ర ఆసక్తి నెలకొంది.

Comments

WhatsApp Share Button