జనసేన ఆశయాల బాటలో ఎమ్మెల్యే పంచకర్ల: 'ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి.. పారదర్శకపాలనే లక్ష్యం'

By D M SATISH KUMAR , 15 September 2026
విశాఖపట్నం

విశాఖపట్నం పెందుర్తి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనగణన, రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ పెందుర్తి, అగనంపూడి జోన్ల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించే జనగణన, రిజర్వేషన్లు, వార్డుల విభజన ప్రక్రియల వల్ల ఏ ప్రాంతానికి, ఏ కులానికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జీవీఎంసీ పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, అగనంపూడి జోనల్ కమిషనర్, పెందుర్తి మరియు అగనంపూడి జోన్ల టౌన్ ప్లానింగ్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు బుట్టా సూర్య కుమారి, రౌతు శ్రీనివాసరావు, రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాసరావు, సేనాపతి శంకర్రావు, దుల్లా రాము నాయుడు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఇందల రమణ, గొన్న రమాదేవి, వేగి దివాకర్, అయితే సింహాచలం, దాట్ల మధు, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, పిన్నింటి పార్వతి, తామరాడ ఆదిబాబు, కంచిపాటి మధు, కాకి బాబు, జనార్ధన శ్రీకాంత్, పిల్ల శివకృష్ణ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Comments

WhatsApp Share Button