సురక్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డాక్టర్ శ్రీ బొడ్డేపల్లి రఘు గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దుబాయ్ పవనిజం, అబుదాబి జనసేన టీమ్ మెంబర్, గల్ఫ్ సేన జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్, యునైటెడ్ కాప్ సొసైటీ (UKS) మరియు JSP గ్లోబల్ ఎన్నారై జనసేన టీమ్ మెంబర్, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు వడ్లపూడి ఆర్ హెచ్ కాలనీకి చెందిన సీనియర్ జనసైనికులు నర్సింగ్ మరిశా (MNR) ఆయనకు తన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నర్సింగ్ మరిశా మాట్లాడుతూ, శ్రీ బొడ్డేపల్లి రఘు గారు అత్యంత ఇష్టపడే మంచి మనసు ఉన్న వ్యక్తి అని, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే 'నేనున్నానని' పలికే మహానుభావుడని కొనియాడారు. పార్టీలోని నిరుపేద కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉండి సహాయం కోసం ఆయన వద్దకు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పే లోపే, ఆయనే స్వయంగా స్పందించి తగిన భరోసా ఇచ్చే గొప్ప మానవతావాది అని అభినందించారు. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శ్రీ బొడ్డేపల్లి రఘు గారు ఆ పరమశివుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు నర్సింగ్ మరిశా పేర్కొన్నారు.
Comments