విశాఖపట్నం పాత రేసపువానిపాలెంలో కొలువైన శ్రీశ్రీశ్రీ శాంతి స్వరూపిణి దుర్గా ఆలయం 24 వ వార్షికోత్సవ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన ఆర్చకుడు కాకర్లమూడి గురునాథ్ ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం,అష్టోత్తర కుంకుమ పూజలు,అమ్మవారికి క్షీరాభిషేకం,శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.సాయంత్రం అమ్మవారి సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారిని 108 క్షీర కళాశాలు,సారె పళ్ళాలు,మేళతాళాలతో తిరువీధులలో ఊరేగించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు,కోలాటాలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Comments